సందేహాలున్నాయి : ఎన్నికలకు ముందే దాడి వెనుక మతలబేంటి?

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నారు. ఎందుకు అప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదని, 78 వాహనాల కాన్యాయ్ ని ఈ సమయంలో ఎలా అనుమతించారంటూ ఆమె ప్రశ్నించారు.
పాకిస్తానీలు భారత్ లో ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఆపేందుకు,పాక్ పై ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రం ఎందుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. కేవలం మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న కారణంగా షాడో వార్ గురించి ఆలోచిస్తున్నారా అంటూ మోడీని మమత ప్రశ్నించారు. తన ఫోన్ ఎప్పుడూ ట్యాప్ కి గురౌతుందని తన దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నట్లు ఆమె తెలిపారు.
వెస్ట్ బెంగాల్ లో రైట్ వింగ్ గ్రూప్ లు మతపరమైన అల్లర్లు సృష్టించాలని సిస్ట్యువేషన్ ని ఉపయోగించుకోవాలని చూసినా, రాష్ట్రంలోని ఏ సిచ్యువేషన్ ని అయినా గట్టిగా హ్యాండిల్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. అసాంఘీక శక్తులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా వాటిని పట్టించుకోకూడదని ప్రజలను మమత కోరారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లు ఇద్దరూ…వాళ్లిద్దరే దేశ భక్తులు,మిగతావాళ్లు కాదని దేశానికి చెబుతున్నారని,అది నిజం కాదని ఆమె అన్నారు.
బీజేపీ,ఆరెస్సెస్,వీహెచ్ పీలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి తాను మౌనంగానే ఉన్నానని, కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను మాట్లాడేలా చేశాయని అన్నారు. కేవలం ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే ఈ ఘటన జరిగిందని, నాలుగున్నరేళ్లల్లో పాక్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని,ఇందులో తనకు అనుమానాలున్నాయని మమత అన్నారు
Read Also : అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి
Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్
Read Also : వీడి ఐడియా తగలయ్యా : Wi-Fi పేరు ‘లష్కర్-ఈ-తాలిబన్’