టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 05:08 AM IST
టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు

Updated On : February 26, 2019 / 5:08 AM IST

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి కీలకంగా ఉపయోగడిన మిరాజ్2000 ను మరోసారి ఇప్పుడు భారత్ ఉపయోగించింది. 
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి
 

మిరాజ్ 2000 యుద్ధవిమానాలు ఎక్కడవంటే?
డసాల్ట్ కంపెనీ తయారు చేసిన మిరాజ్ విమానాలు శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు 1984నుంచి ఫ్రెంచ్ నావికాదళంకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా, ఈజిప్ట్, గ్రీస్, పెరు, ఖాతర్, తైవాన్, యూఏఈ దేశాలలో అందుబాటులో ఉన్నాయి. 

ఆకాశంలోకి బాంబులను వేయగలదు
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన మిరాజ్ 2000 యుద్ధంలో అనేక పాత్రలు పోషిస్తుంది. 1970లో మిరాజ్ తయారీ మొదలైతే 1984 నుంచి ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందిస్తోంది. మిరాజ్ 2000లో సింగిల్ సీటర్, డబుల్ సీటర్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ విమానంలో తొమ్మిది చోట్ల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబులను వేయగల సత్తా మిరాజ్ 2000 యుద్ధవిమానానికి ఉంటుంది. 
Also Read : గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ

యుద్ధ విమానాల సామర్ధ్యం
మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను మోసుకుని వెళ్లగలిగే సామర్ధ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. MBDA BGL 1000 లేజర్ గైడెడ్ బాంబ్, MBDA AS30L, MBDA ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, MBDA AM39 Exocet యాంటీ షిప్ మిసైల్, MBDA రాకెట్ లాంఛర్లు, MBDA Apache ఆయుధాలను ఈ యుద్ధ విమానం మోసుకుని వెళ్తుంది. ఈ యుద్ధ విమానాలలో టీవీ/సీటీ సీఎల్ డీపీ లేజర్ ఉంటుంది. 

కార్గిల్ వార్ లో కీలకంగా మిరాజ్ 2000
ఈ లేజర్ గైడడ్ ఆయుధాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేయగలవు. మిరాజ్ 2000ను భారత్ లో తొలిసారి 1999లో వాడారు. కార్గిల్ వార్ సమయంలో ఈ యుద్ధ విమానం ఆశ్చర్యకరంగా భారత్ వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం మన భారతదేశం దగ్గర 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి.

Also Read : ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం