యడియూరప్ప ఉద్యోగం ఊడనుందా? : కర్ణాటకలో కాక రేపుతున్న బీజేపీ MLAల మీటింగ్ లు

యడియూరప్ప తర్వాత ఎవరు అనే ప్రశ్న అనే కర్ణాటక అధికార పార్టీలో కీలక చర్చగా మారింది. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకే గురువారం బీజేపీ ఎమ్యేలు సమావేశాలు నిర్వహించారన్న వదంతులు ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఇప్పటివరకు సీఎం యడియూరప్పకు ఎలాంటి ప్రత్యామ్నాయాం లేని ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ… కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమై ప్రత్నామ్నాయ నాయకుడి విషయంపై చర్చించారని…మాజీ సీఎం జగదీష్ షెట్టర్ మరియు పంచమశాలి లింగాయత్ వర్గానికి చెందిన MLA బసన్ గౌడ పాటిల్ యత్నాల్ వైపు వీళ్లు మొగ్గుచూపినట్లు సమాచారం.
కరోనా మహమ్మారి సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం యడియూరప్ప మాట్లాడలేదని,వాళ్ల నియోజకవర్గాల్లో ఏం జరుగుతందన్నదానిపై ఆయన పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప పూర్తి సామర్థ్యంతో పనిచేయలేరని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. యడియూరప్ప పనిచేసే విధానాల్లో మార్పులకు ఆయన వయస్సు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
దాదాపు 40మంది బీజేపీ ఎమ్మెల్యేలు యడియూరప్పకు ప్రత్యామ్నాయంగా జగదీష్ షెట్టర్, బసన్ గౌడ పాటిల్ యత్నాల్ పేర్లను హైకమాండ్ కు సూచించాలని రెడీ అయినట్లు సమాచారం. గడిచిన కొన్ని రోజులుగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు ఈ విషయమై ఫోన్ ల ద్వారా,మీటింగ్ ల ద్వారా చర్చిస్తున్నట్లు సమచారం. మరోవైపు 15-20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావాడి తెలిపారు. పార్టీలో వారి చేరికపై కేంద్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Read: జాతినుద్దేశించి ఆడియో మెసేజ్ విడుదల చేసిన మోడీ