Short Circuit: మామతో సంబంధం.. భర్తకి కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో జరిగింది. తాగితిరుగుతున్న భర్తను ఎలాగైనా మార్చాలని మామ ముకేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు.

Short Circuit: మామతో సంబంధం.. భర్తకి కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

Short Circuit

Updated On : May 19, 2021 / 4:29 PM IST

Short Circuit:  మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో జరిగింది. తాగితిరుగుతున్న భర్తను ఎలాగైనా మార్చాలని మామ ముకేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు.

కొడుకు మార్చాల్సిన మామ కోడలిపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకున్నాడు. ఇద్దరు కలిసి గత ఐదు నెలలుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిమదిలో ఓ దురాలోచన వచ్చింది. భర్తను లేకుండా చేస్తే తమకు అడ్డొచ్చే వారు ఉండరని ఇద్దరు అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా భార్య పథకరచన చేసింది.. మొదట నిమ్మరసంలో మత్తుబిళ్లలు వేసి భర్తకు ఇచ్చింది. అది తాగి మత్తులోకి జారుకున్న తర్వాత కరెంటు వైర్లు తీసుకుని కరెంట్ షాకిచ్చి చంపేసింది. తాగిన మైకంలో కరంటు తీగలు పట్టుకుని షాక్ తో చనిపోయాడని ఇరుగుపొరుగువారిని నమ్మించింది.

ఆ తర్వాత వెంటనే అంత్యక్రియలు తంతు కూడా కానించేసారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్య, తండ్రిని తమదైన శైలిలో విచారించారు. చివరకు ఇద్దరు నిజం ఒప్పుకోవడంతో కటకటాలపాలయ్యాడు.