ఏప్రిల్ 15 తర్వాత భారత్‌లో కరోనా విశ్వరూపం చూపించనుందా?

దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 03:28 PM IST
ఏప్రిల్ 15 తర్వాత భారత్‌లో కరోనా విశ్వరూపం చూపించనుందా?

Updated On : March 23, 2020 / 3:28 PM IST

దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి

దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను గొప్ప ఆయుధంగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. నగరాలకు నగరాలనే దిగ్భందించి చైనా కరోనాను అడ్డుకొంది. ఆ మార్గంలోనే కరోనాను ఎదుర్కొందామన్నది భారతదేశం భావన. ఒక్కసారిగా లాక్‌డౌన్ అనగానే… వేలాది మంది ఊళ్లకు చేరడానికి బస్సులు, ప్రైవేట్ ట్రావెలర్స్ రోడ్డల మీదకు వచ్చేశారు. కిక్కిరిసి వాహనాలెక్కారు. కరోనా ప్రమాదాన్ని మరింత పెంచారు.

22 రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో లాక్‌డౌన్:
రాజధాని న్యూఢిల్లీలోని అన్ని జిల్లాలను లాక్‌డౌన్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఇప్పటికే దిగ్భందంలో ఉంది. నిత్యవసర వస్తువులు మినహా మిగిలిన సర్వీసులను బంద్ చేసింది. బ్యాంక్, స్టాక్‌ ఎక్సేంజ్‌లు పనిచేస్తున్నాయి. అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిని అధికారులు అడ్డుకున్నారు. మొత్తం 22 రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో శనివారమే లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ లాక్‌డౌన్ అన్నాయి. అత్యవసర సర్వీసులు, నిత్యవసర వస్తులువులు మినహా మరే సందర్భంలోనూ రోడ్డెక్కకూడదని జనాలను ఆదేశించాయి.  

ఏప్రిల్ 15 నాటికి ఇన్ఫెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోవచ్చు:
సోమవారం(మార్చి 23) సాయంత్రానికి కరోనా కేసులు మొత్తం 415కి చేరితే, భారతదేశ కరోనా కల్లోనానికి మహారాష్ట్ర కేంద్రంగా అవతరించింది. నిజానికి కేసుల పెరుగుదల కాస్త స్లోనే. సంతోషం. కాకపోతే అనుకున్నంత రీతిలో కట్టడిచేయలేకపోతున్నాం కాబట్టి, ఏప్రిల్ 15 నాటికి ఇన్ఫెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని Indian Council for Medical Research’s Centre for Advanced Research in Virology మాజీ డైరెక్టర్ Dr. T. Jacob John ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి తీవ్రత ఇటలీ, ఇరాన్ కన్నా దారుణంగా ఉండొచ్చని అంటున్నారు. ఇటలీలో 59వేల 138కేసులు నమోదైతే 5వేల 476 చనిపోయారు. ఇక ఇరాన్ లో 23వేల 049 కేసులు నమోదైతే 1,812 మంది చనిపోయారు. ఈ రెండు దేశాల్లో హాస్పటల్స్ నిండిపోయాయి. హెల్త్ వర్కర్స్ కూడా కరోనాకి బలవుతున్నారు.

లాక్‌డౌన్ మంచి నిర్ణయమే, అలాగని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు కాదు:
‘లాక్‌డౌన్ చేయడం మంచి నిర్ణయమే. అలాగని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు కాదు. మొత్తం జనాభాలో పదిశాతం మందికి సోకితే, 80 లక్షలమంది సీనియర్ సిటిజన్స్‌కు వైరస్ ముప్పు ఉన్నట్లే. వారం క్రితమే చేసినట్లయితే కొంత లాభం ఉండేది. వైరస్ వ్యాప్తి కన్నా భారతదేశం రెండడుగులు వెనుకనే ఉంది. మధ్య భారతంలోకి వైరస్ ప్రవేశించిందంటే భయపడాల్సిందే.’                                    డాక్టర్  జాకబ్ జాన్

భారత దేశానికి ఈ లాక్‌డౌన్ మరో దెబ్బ:
11 ఏళ్లలో అతి తక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తున్న భారత దేశానికి ఈ లాక్‌డౌన్ మరో దెబ్బ. ఆల్ టైం తక్కువకు రుపాయి విలువ పడిపోయింది. స్టాక్ మార్కెట్ లక్షల కోట్లు కోల్పోయింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థే మందగమనంలోకి వెళ్లిపోతోందన్న అంచాలున్నాయి.  కరోనా దెబ్బకు విదేశీ పెట్టుబడి దారులు ఇప్పటికే 10బిలియన్ డాలర్ల మేర షేర్లను ఉపసంహరించుకున్నాయి.  2013 తర్వాత ఇది అతిపెద్ద పెట్టుబడి ఉపసంహరణ. ఆర్బీ‌ఐ మార్కెట్ లోకి నిధులను పంపిణీ చేస్తోంది. డాలర్ల ప్రవాహమూ మొదలైంది. మార్కెట్ ఫ్రీజ్ కాకుండా పాట్లు పడుతోంది. పరిస్థితి ఏమాత్రం అదుపుతప్పినా, 5.9 లక్షల కోట్ల రుణాలను రీపే చేయడం భారతీయ కంపెనీలు కష్టమని ప్రభుత్వానికి తెలుసు.

కరోనా వ్యాప్తి చైన్ కు బ్రేక్!
జనతా కర్ఫ్యూ అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో జనం రోడ్డెక్కలేదు. 14గంటల కర్ఫ్యూలో దేశమే నిర్మానుష్యంగా కనిపించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోడంలో మరీ ముఖ్యంగా కరోనా వ్యాప్తి చైన్ ను బ్రేక్ చేయడంలో ఈ కర్ఫ్యూ కీలకమని ప్రభుత్వాలు చెప్పాయి. జనం నమ్మారు. అందుకే ఎవరూ గడపదాటలేదు. సోమవారం వచ్చింది. హైదరాబాద్ రోడ్లమీద ట్రాఫిక్ జామ్. అంతే మోడీ నుంచి సీపీ అందరూ కన్నెర్ర చేశారు. మంగళవారం(మార్చి 24) నుంచి అసలు కట్టడి మొదలుకానుంది.

భవిష్యత్తులో రోజుకే కనీసం 10వేల టెస్ట్ లు చేయాల్సి ఉండొచ్చు:
కరోనా కట్డడికి ప్రధాన ఆయుధం టెస్ట్…టెస్ట్…టెస్ట్ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ తేల్చేసినా భారతదేశం అంత సీరియస్‌గా తీసుకోలేదు. చైనా, కొరియాలు చేసింది అదే. ఇప్పటిదాకా భారతదేశంలోకి టెస్ట్ చేసిందంతా విదేశాల నంచి వచ్చినవారినే. కరోనా వచ్చినవారిని, వాళ్లతో కాంటాక్ట్ ఉన్నవాళ్లనే టెస్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు The Ministry of Health and Family Welfare ఎవరికి కరోనా టెస్ట్  చేయాలో కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. pneumonia symptoms, respiratory illnesses ఉన్నవాళ్లకు తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేస్తున్నారు. అందుకే కరోనా పాజిటీవ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని అంటున్నారు వైద్యనిపుణులు. టెస్ట్ లు పెరుగుతున్నకొద్దీ ఈ జాబితా మరింత పెరుగుతుంది. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు. ఎంతగా టెస్ట్ చేస్తే….అంతలా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అందుకే భవిష్యత్తులో రోజుకే కనీసం 10వేల టెస్ట్ లు చేయాల్సి ఉందన్నది నిపుణుల మాట. అలాగని అన్నింటిని ప్రభుత్వమే చేయలేదు. అందుకే ప్రైవేట్ హాస్పటల్స్ కు అనుమతినిచ్చారు. రూ. 4,500 రేటును Indian Council for Medical Research ఫిక్స్ చేసింది.

లాక్ డౌన్ తో ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదు. ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి పర్వాలేదు. సమస్యంతా ఎలాంటి జాబ్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్ లేని కూలీలు, కార్మికులదే. ఒక్క ముంబైలో 80 లక్షల మంది వలస వచ్చిన వాళ్లున్నారు. ఒకవేళ వారాల తరబడి లాక్ డౌన్ చేస్తే….వీళ్ల పరిస్థితి ఏంటి?