2024 elections in India: 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు నితీశ్, మమత, కేసీఆర్ ప్రయత్నాలు: అఖిలేశ్

దేశంలో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, పలు ప్రయత్నాలు చేస్తున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని అన్నారు.

2024 elections in India: 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు నితీశ్, మమత, కేసీఆర్ ప్రయత్నాలు: అఖిలేశ్

Akhilesh Yadav As Party Loses Key Seat Want Repoll

Updated On : December 13, 2022 / 7:09 AM IST

2024 elections in India: దేశంలో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, పలు ప్రయత్నాలు చేస్తున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని అన్నారు.

రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ దేశ ప్రజలకు ఇచ్చిన హక్కులను కేంద్ర సర్కారు కాలరాస్తోందని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రస్తుతం బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం ఉందని ఆయన చెప్పారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను కూడగట్టేందుకు ఇప్పటికే నితీశ్ కుమార్ పలువురితో చర్చలు జరిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని పలు నియోజక వర్గాల నుంచి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం