Fuel Prices : చమురు ధరలు దిగొస్తాయా? నిర్మలమ్మ మాటల్లోనే..!

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది.

Fuel Prices : చమురు ధరలు దిగొస్తాయా? నిర్మలమ్మ మాటల్లోనే..!

Minister Nirmala Sitharaman (1)

Updated On : August 17, 2021 / 7:14 AM IST

Nirmala Sitharaman : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది. ఇప్పట్లో పెట్రో ధరలు తగ్గే అవకాశాలు లేవని సంకేతమిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్‌ బాండ్ల భారమే లేకపోయి ఉంటే తప్పకుండా సామాన్యులకు ఊరట కల్పించే వాళ్లమని చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వం ఆయిల్‌ బాండ్లకు చెల్లిస్తుండడం కారణంగానే ఇప్పుడు పన్నులు తగ్గించలేకపోతున్నామన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సబ్సిడీకి బదులు ఆయిల్‌ కంపెనీలకు లక్షా 40 వేల లక్షల కోట్ల విలువైన ఆయిల్‌ బాండ్లను జారీ చేసిందన్నారు. ఆ బాండ్లకు ఇప్పుడు తమ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందన్నారు నిర్మల. అవే గనుక లేకుంటే తప్పకుండా చమురు ధరల భారం నుంచి విముక్తి కల్పించేవాళ్లమని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించకపోవడానికి ఇదే కారణమని వివరించారు.
Petrol Rate Today : 30 రోజులుగా పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు

పెట్రోల్‌ భారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదాయం కొంతమేర మెరుగుపడిందన్నారు. థర్డ్‌ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. రానున్న పండగల సీజన్‌కు ఉత్పత్తులకు గిరాకీ పెరిగి.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు నిర్మల.