Bengaluru : ట్రాఫిక్ జామ్‌లో కూడా బైక్ మీద కూర్చుని ల్యాప్ టాప్‌లో పని చేసుకుంటున్న మహిళ..
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. సమయానికి ఆఫీసులకి చేరలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్‌గా ఓ మహిళ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి బైక్ మీద కూర్చుని ల్యాప్ ట్యాప్‌లో పని చేసుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

Bengaluru
Woman working with laptop on bike : ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఓ మహిళ బైక్ మీదనే ఆఫీసు పని చేసేస్తోంది. ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న మహిళ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవనిపిస్తోంది. రద్దీగా ఉండే స్ట్రీట్ లో రాపిడో బైక్ వెనుక కూర్చుని ల్యాప్ టాప్‌లో పని చేసుకుంటున్న మహిళ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆఫీస్‌కి చేరడానికి సమయం మించిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది. కోరమంగళ-అగార-ఔటర్ రింగ్ రోడ్ లో ఈ ఫోటో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోని నిహార్ లోహియా అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు.
‘ఇలా కూడా పనిచేస్తారా? .. ఇది చాలా బాధాకరమని.. ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆమెకు ఇవ్వాలని’ యూజర్లు వరుసగా కామెంట్లు పెట్టారు. ఓవైపు ఎండలు.. మరోవైపు విపరీతమైన ట్రాఫిక్.. ఆఫీస్‌కి ఆలస్యంగా చేరితే బాస్‌తో అక్షింతలు.. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు బెంగళూరు వాసులు.
Peak Bangalore moment. Women working on a rapido bike ride to the office. #TrafficJam #TrafficAlert #bangaloretraffic #Bangalore #roadblock #peakbangalore pic.twitter.com/bubbMj3Qbs
— Nihar Lohiya (@nihar_lohiya) May 16, 2023