కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లయితే 15నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం : రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2020 / 06:34 PM IST
కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లయితే 15నిమిషాల్లో చైనాను తరిమేసేవాళ్లం : రాహుల్

Updated On : October 7, 2020 / 7:17 PM IST

Would have thrown out China in less than 15 minutes… Rahul Gandhi చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.


హర్యానాలో పర్యటిస్తోన్న రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ…మన దేశ భూభాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని ఈ పిరికి ప్రధాని చెబుతున్నారు. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది. అలా భూమిని కోల్పోయిన దేశం ప్రపంచంలో ఈవేళ ఒక్కటే ఉంది. అయినప్పటికీ, మన దేశ ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేము గనుక అధికారంలో ఉంటే చైనాను 15 నిమిషాల్లో తరిమేసేవాళ్లం అని రాహుల్ అన్నారు. తాము పవర్‌‌‌లో ఉన్న సమయంలో ఏనాడూ మన భూభాగంలోకి అడుగు పెట్టడానికి చైనా సాహసం చేయలేదని రాహుల్ అన్నారు.