చాలా మంచి బడ్జెట్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆయన చెప్పారు.
విద్యారంగానికి కూడా కేటాయింపులు ఎక్కువ చేశారని….గతంలో నేను ఏఏ అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడానో వాటికి కేటాయింపులు ఎక్కువ జరపటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. జలజీవన్ మిషన్, మెడికల్ కాలేజీ సీట్లు వంటి విషయాలపై గతంలో మాట్లాడానని అలాంటివన్నిటికీ యాధృచ్చికంగా ఈబడ్జెట్ లో కేటాయింపులు జరిపారని ఆయన అన్నారు.
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక పధకం ప్రారంభించారని ఆ పధకానికి జలజీవన్ మిషన్ మరింత ఊతం ఇవ్వనున్నదని ఆయన వివరించారు. ఆక్వా రంగ అభివృధ్దికి ఎక్కువ నిధులు కేటాయించారని..నరసాపురం నియోజక వర్గంలో ఆక్వా పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.