Karnataka : యడియూరప్ప జీవితంలో కీలకమైన రోజు..ఏం జరుగనుంది ?
కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తిగా మారుతున్నాయి. సీఎం యడియూరప్ప పదవి నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తన భవిష్యత్తుకు సంబంధించి సాయంత్రంలోగా హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడే అవకాశముందని స్వయంగా యడియూరప్పే ప్రకటించారు.

Karnataka
Yediyurappa : కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తిగా మారుతున్నాయి. సీఎం యడియూరప్ప పదవి నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తన భవిష్యత్తుకు సంబంధించి సాయంత్రంలోగా హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడే అవకాశముందని స్వయంగా యడియూరప్పే ప్రకటించారు. హైకమాండ్ నిర్ణయం తర్వాత తన అభిప్రాయాన్ని ప్రకటిస్తానన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకటించగానే యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. యడియూరప్పకి.. 78 సంవత్సరాల వయసే ప్రధాన శత్రువుగా మారింది.
Read More : Private Part Chopped : దారుణం.. చెల్లిని ప్రేమించాడని, మర్మాంగం కోసి హత్య
ఆయన వయస్సు 76 సంవత్సరాలు : –
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రగతికి మార్గదర్శకుడైన యడియూరప్పను అధిష్టానం గౌరవించింది. ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించిన ఆయన అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి.. సూచనలను పాటిస్తానని ఇటీవలే ప్రకటించారు. 2021, జూలై 26వ తేదీ సోమవారం యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు పూర్తవనుండడంతో ఆదివారం ఆయన బెళగావి పర్యటనలో ఉండగానే అదిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.
Read More :30 Weds 21 : రకరకాల భార్యలు..ఆర్జీవీ వెబ్ సిరీస్, ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో రకం భార్య
నాలుగోసారి ముఖ్యమంత్రి : –
ఎన్నో పోరాటాల అనంతరం 2019 జూలై 26న నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప ఈ రెండేళ్లు రాజీనామా వదంతులు, ప్రకృతి వైపరీత్యాలతో సహవాసం చేశారు. ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. నాలుగోసారి ప్రయాణం అంత సజావుగా సాగలేదు. బీజేపీ, జేడీఎస్ నుంచి రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల అండతో అధికారాన్ని అందుకున్నా.. వారి కారణంగానే పార్టీ కంట్లో నలుసుగా మారారు. వలస నేతలందరికీ పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి సహజంగానే పార్టీ విధేయులకు దూరమయ్యారు. సొంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు బావుటా ఎగురువేసి చివరకు సీఎం పీఠాన్ని కదలించే స్థాయికి చేరారు. యడియూరప్ప లేనిదే బీజేపీ లేదని అన్నవారు ఆయనే పార్టీకి అడ్డంకిగా మారారని దుష్ప్రచారం చేశారు. మరి కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.