Kim Denicola : మెదడులోంచి చెరిగిపోయిన 30 ఏళ్ల జ్ఞాపకాలు.. ఈ కొత్త జీవితాన్ని దేవుడే ఇచ్చాడంటున్న మహిళ

మనుమలతో చక్కగా ఆడుకోవాల్సిన 56 ఏళ్ల మహిళ అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి పడిన గందరగోళాన్ని అర్థం చేసుకునేపనిలో బిజిబిజీగా ఉంది. కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకోవటంలో బిజీ బిజీగా ఉంది.

Kim Denicola : మెదడులోంచి చెరిగిపోయిన 30 ఏళ్ల జ్ఞాపకాలు.. ఈ కొత్త జీవితాన్ని దేవుడే ఇచ్చాడంటున్న మహిళ

US Women Kim Denicola : ఆమె వయస్సు 56 ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. ముద్దులొలికే మనుమలు కూడా ఉన్నారు. మనుమలతో చక్కగా ఆడుకోవాల్సిన ఆమె..అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి పడిన గందరగోళాన్ని అర్థం చేసుకునేపనిలో బిజిబిజీగా ఉంది. ఏంటా గందరగోళం అంటే..‘మరుపు’. ఆమె జీవితంలో జరిగిన 30 ఏళ్ల జ్ఞాపకాలు అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. అన్ని ‘మర్చిపోయింది’. భర్తా, పిల్లలు, మనుమలు అందరిని మర్చిపోయింది. తానో టీనేజర్ని అనే ఫీలింగ్ లో ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలో 30 ఏళ్ల జ్ఞాపకాలు మాయం అయిపోయినా..స్కూల్లో తన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. 30 ఏళ్ల జ్ఞాపకాలు పోయినా ఆమె మాత్రం బాధపడటంలేదు. పైగా ఇదో కొత్త జీవితం..కొత్త జ్ఞాపకాలను వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నానంటోంది యూఎస్ లోని లూసియానాకు చెందిన కిమ్ డెనికోలా అనే 56 ఏళ్ల.

2018లో ఆమె తన 30 ఏళ్ల జ్ఞాపకాలను కోల్పోయింది. అప్పటినుంచి ఆమె కొత్త జ్ఞాపకాలను వెతుక్కోవటంలో బిజీగా ఉంది. 2018లో తీవ్ర తలనొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆమె ఎమర్జెన్సీ వార్డులో స్పృహలోకి వచ్చింది. తానో టీనేజర్ని అనే భ్రమలో ఉంది. భర్త, పిల్లల్ని మర్చిపోయింది. తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయింది. కానీ తనకు భర్తా, పిల్లలు ఉన్నాయని మర్చిపోయనని తెలిసి షాక్ అయ్యింది.

ఆమెకు మెలకువ వచ్చాక తనను తాను చూసుకుని నివ్వెరపోయింది. ఆస్పత్రిలో నర్స్ తో మాట్లాడగా..తాను 1980లో ఉన్నట్లుగానే మాట్లాడింది. దానికి నర్స్ షాక్ అయ్యింది. ఇది 1980 కాదు 2018 అని చెప్పింది. దాంతో కిమ్ షాక్ అయ్యింది. ఈక్రమంలో నర్స్ అమెరికి ప్రెసిడెంట్ ఎవరు అని ప్రశ్నించగా..రోనాల్డ్ రీగన్ అని చెప్పింది. ఇంకా తాను తన స్కూల్ వదిలిన తరువాత తన కారువైపుగా వెళ్తున్నట్లుగా గుర్తుందని..తన సీనియర్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని ఇప్పుడే ఎగ్జామ్ కూడా రాసి వస్తున్నానని చెప్పింది. దీంతో నర్స్..ఆస్పత్రి సిబ్బంది. ఆమె భర్తా పిల్లలు షాక్ అయ్యారు.

అప్పటి నుంచి ఆమె గతాన్ని గుర్తు చేసుకోలేకపోతోంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కిమ్ ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆమె మెదడులో అసలు ఏం జరిగిందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఆమె 30 ఏళ్ల గతాన్ని మర్చిపోయి 5ఏళ్లు అవుతున్నా..ఆమెకు అనేక పరీక్షలు చేస్తున్నా.. ఈ మిస్టరీ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఇక ఎన్నడూ గుర్తుకు రాకపోవచ్చని చెబుతున్నారు.

ఆమె తన 30 ఏళ్ల జీవితాన్ని మర్చిపోయి ఐదేళ్లు అవుతున్నా ఏమాత్రం గుర్తుకు రావటంలేదు. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా అరవై ఏళ్ల ఆ మహిళను మీడియా మళ్లీ పలకరించగా నాటి విషయాలను మరోసారి చెప్పుకొచ్చింది. ఎన్నో క్రిస్మస్ వేడుకలు తన స్పృతి పథం నుంచి చెరిగిపోయినా కొత్త జ్ఞాపకాలను పోగేసుకుంటున్నానని కిమ్ తెలిపింది. అప్పట్లో తాను రాసుకున్న డైరీలు చదువుతుంటే ఎవరో జ్ఞాపకాలను చూస్తున్నట్టు అనిపిస్తోందని అమాయకంగా చెబుతోంది. కానీ తనకు వచ్చిన ఈ సమస్య తనను బాధించటంలేదని..దేవుడు ఏదో కారణంతోనే తనకీ పరిస్థితి కల్పించాడని కిమ్ చెప్పటం విశేషం. లోపాన్ని కూడా ఆస్వాదిస్తున్న ఆమె ఓ సరికొత్త జీవితాన్ని వెతుక్కుంటోంది. దేవుడు తనకు ఈ పరిస్థితి కల్పించటం వెనుక ఉన్న ఆ కారణమేంటో ఏదో రోజు తెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉందామె. ‘‘నేను పాత జ్ఞాపకాలు మర్చిపోయినా..కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకోవచ్చు కదా’’ అంటోంది. తనకో ఆశ ఉందని..క్రిస్మస్ పండుగను తన కుటుంబం అంతా కలిసి ఒకచోటే జరుపుకోవాలని ఉందని ఆకాంక్షించింది.