CM KCR : మళ్లీ అధికారంలోకి వస్తాం, పెన్షన్ పెంచుతాం- సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతు భీమా పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తాము? CM KCR - Suryapet

CM KCR : మళ్లీ అధికారంలోకి వస్తాం, పెన్షన్ పెంచుతాం- సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

CM KCR

CM KCR – Suryapet : తెలంగాణలో మరోసారి(మూడోసారి) బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అన్నారు కేసీఆర్. అంతేకాదు గత ఎన్నికల కంటే ఈసారి 5 నుంచి 10 సీట్లు ఎక్కువ సాధిస్తామని నమ్మకంగా చెప్పారు. సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఅర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

”50ఏళ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? కాంగ్రెస్ పాలనలో ప్రజలను, రైతులను బానిసలుగా చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా చూసుకున్నాము. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? తెలంగాణలో కళ్ళ బొల్లి మాటలను ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో పెన్షన్ పెంచుతాం. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒకరు, మూడు గంటల కరెంటు అని ఇంకొకడు చెబుతాడు.

Also Read..Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్

కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపిస్తే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కర్ణాటక కష్టాలు మనమూ కొని తెచ్చుకుందామా? ధరణితో కష్టాలు తొలగిపోయాయి. అక్రమాలకు చెక్ పడింది. ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతు భీమా పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తాము? “ధరణి” అనేది రైతు భూమి హక్కు. పట్టా రైతు లేకుండా పేరు తొలగించే అధికారం ఎవరికీ లేదు. కాంగ్రెస్ పాలనలో ముక్కు పిండి ప్రజలకు మూసీ మురికి నీళ్ళు తాపించారు. కాళేశ్వరం జలాలతో పంటలను మేం సస్యశ్యామలం చేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 సీట్లు గెలిపించి తీరతాం” అని కేసీఆర్ అన్నారు.

Also Read..Supari Audio Tape : మంథనిలో సుపారీ ఆడియో టేప్ కలకలం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను చంపేందుకు సుపారీ ఇచ్చారంటూ చెప్పిన అజ్ఞాత వ్యక్తి