AIADMK: జయలలితపై బీజేపీ చీఫ్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన అన్నాడీఎంకే
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళనిస్వామి అన్నారు.

Annamalai
Annamalai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కే.అన్నామలై చేసిన విమర్శలపై అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే/అన్నాడీఎంకే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆయనపై చర్యలకు తీర్మానం చేసింది. ఓ టీవీ డిబేబ్లో అన్నామలై మాట్లాడుతూ జయలలితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అన్నాడీఎంకే మంగళవారం తీర్మానం చేసింది.
Russia Day: ఉక్రెయిన్లో రష్యా డే ఉత్సవాలు.. గొప్ప మాతృభూమి అంటూ నినాదాలు
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రతిపక్ష నేతతో అన్నాడీఎంకే అధినేత అయిన పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. “అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది” అని పళనిస్వామి అన్నారు.
Farmers Protest: రోడ్డెక్కిన రైతులు.. మరోసారి మూసుకుపోయిన ఢిల్లీ-ఛండీగఢ్ జాతీయ రహదారి
కొద్ది రోజుల క్రితం అన్నామలై ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏఐఏడీఎంకే మాజీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నిస్తామన్న ఆయన ‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అవినీతిలో నంబర్ వన్ అని అన్నామలై అన్నారు.
అయితే అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలపై అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అధినేత TTV దినకరన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నామలై ఎలాంటి అనుభవం లేని రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా అమ్మ (జయలలిత)పై అన్నామలై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తోందని మూడు పేజీల ప్రకటనలో టీటీవీ దినకరన్ పేర్కొన్నారు.