AP BJP Leaders : టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇచ్చారు- చంద్రబాబుపై బీజేపీ సీనియర్లు ఆగ్రహం, అధిష్టానానికి లేఖ
ఆ 3 సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ.. అక్కడ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.

AP BJP Leaders Angry On Chandrababu Naidu
AP BJP Leaders : ఏపీ బీజేపీలో పొత్తుల లొల్లి షురూ అయ్యింది. పొత్తులపై గళం విప్పుతున్నారు బీజేపీ సీనియర్ నేతలు. తాము అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీకి కేటాయించారంటూ బీజేపీ అగ్రనేతలకు రాష్ట్ర సీనియర్ నేతలు లేఖ రాశారు.
అధిష్టానానికి రాసిన లేఖలో 16మందికిపైగా సీనియర్ నేతలు సంతకాలు చేశారు. లేఖ సారాంశాన్ని నిన్న రాత్రి పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు సీనియర్లు. శ్రీకాళహస్తి, గుంటూరు వెస్ట్, కదిరి సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ ఆ మూడు సీట్లకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.
Also Read : పవన్ కల్యాణ్ ప్రకటనతో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన కార్యకర్తలు
ఏపీ బీజేపీలో పొత్తుల అంశంపై విబేధాలు తారస్థాయికి చేరాయి. పొత్తుల్లో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన సీట్లపై బీజేపీ సీనియర్లతో పాటు జిల్లాల ఇంఛార్జ్ లు, నియోజకవర్గాల్లో సీట్లను ఆశించిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఖరారైనట్లు ప్రకటించారు. అయితే, పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను బీజేపీ అడిగింది. ముఖ్యంగా 3 సీట్లను బీజేపీ ఆశించింది. శ్రీకాళహస్తి (కోలా ఆనంద్), గుంటూరు వెస్ట్ (జయప్రకాశ్), కదిరి (విష్ణువర్దన్ రెడ్డి).. సీట్లను బీజేపీ ఆశించింది. అయితే ఈ సీట్లతో చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేతలు నిన్న విజయవాడలో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ గెలవని సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయిస్తున్నారు అని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ సీనియర్లు.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు. దీనిపై బీజేపీ నేతలు తమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : సీనియర్లకు చంద్రబాబు షాక్..! టీడీపీ రెండో జాబితాలోనూ చోటు దక్కని కీలక నేతలు వీరే