Pithapuram TDP Activists Protests : పవన్ కల్యాణ్ ప్రకటనతో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన కార్యకర్తలు

మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కార్యకర్తలు.

Pithapuram TDP Activists Protests : పవన్ కల్యాణ్ ప్రకటనతో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన కార్యకర్తలు

Updated On : March 14, 2024 / 5:26 PM IST

Pithapuram TDP Activists Protests : పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించగానే.. టీడీపీ శ్రేణులు ఆందోళనలు తీవ్రం చేశాయి. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు కార్యకర్తలు. స్థానిక నేత వర్మకు సీటు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కార్యకర్తలు.

తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పిఠాపురం టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. వారిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం టికెట్ ను ఆశించారు. పిఠాపురం టికెట్ తనకు వస్తుందని ఆశించారు. ఈ మేరకు కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. వర్మ మద్దతుదారులు ఆగ్రహానికి లోనయ్యారు.

పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. పిఠాపురం టికెట్ వర్మకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్మ మద్దతుదారులు టీడీపీ ఆఫీసు ముందు రచ్చ రచ్చ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. దీంతో టీడీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

Also Read : టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా