అవినీతి చక్రవర్తి జగన్ : సీఎం చంద్రబాబు

అమరావతి : బీజేపీ, వైసీపీలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీలో అందరూ కలసికట్టుగా పని చేయాలని, గ్రూపు రాజకీయాలు స్వస్తి పలకాలని సూచించారు. అవినీతిపరులే అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వల్ల ఎందరో జైలుకు వెళ్లారని, అవమానాలకు గురయ్యారని పేర్కొన్నారు. జయప్రకాశ్ కమిటీ రూ.75 వేల కోట్లు ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. కేంద్రం ఇవ్వాల్సిన దానిపై జగన్ ఎందుకు నోరు మెదపడు అని ప్రశ్నించారు.
దేశంలో సంఘ్ పరివార్ కుట్రలకు కేంద్రంగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ కుట్రలను అమలు చేసే కేంద్రంగా బీజేపీ మారిందని విమర్శించారు. కుట్ర కోణాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాల్మికీ బోయలను ఎస్టీలో చేర్చడం పట్ల కూడా కేంద్ర చొరవ చూపాలన్నారు.