అసెంబ్లీలో కేసీఆర్ చాంబర్ మార్పు… భగ్గుమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కు కేటాయించే ఛాంబర్ ను మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. ఓ చిన్న చాంబర్ ను కేసీఆర్ కు కేటాయించారు.

అసెంబ్లీలో కేసీఆర్ చాంబర్ మార్పు… భగ్గుమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

KCR Chamber Changed

Updated On : February 8, 2024 / 3:52 PM IST

KCR Chamber : అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ ను ప్రభుత్వం మార్చింది. ఆయనకు చిన్న చాంబర్ ను కేటాయించింది. ముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది.

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు చాంబర్ కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి ప్రతిపక్ష నేతకు కేటాయించే చాంబర్ విషయంలో మార్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చిన్న గదినే మాత్రమే కేసీఆర్ కు కేటాయించారు. ముందుగా కేటాయించిన చాంబర్ ను స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించింది ప్రభుత్వం. ఈ అంశాన్ని బీఆర్ఎస్ చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ కు కేటాయించిన చాంబర్ సరిపోదని, పెద్ద గదిని కేటాయించాలని వారంతా స్పీకర్ ను కోరుతున్నారు.

అదే విధంగా ప్రోటోకాల్ సమస్య తరుచూ తలెత్తుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని వెల్లడించారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్ ఛాంబర్ మార్పు, ప్రోటోకాల్ గొడవపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

Also Read : సీఎం రేవంత్, భట్టివిక్రమార్కపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో అంటే అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన మొదట్లో కేసీఆర్ కు ఒక చాంబర్ కేటాయించారు. ఎప్పుడూ ప్రతిపక్ష నేతకు కేటాయించే చాంబర్ అది. దాన్నే కేసీఆర్ కు కేటాయించారు. అయితే, ఈ సెషన్ ప్రారంభమైన తొలిరోజే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కు కేటాయించే ఛాంబర్ ను మార్చేసింది ప్రభుత్వం. ఓ చిన్న చాంబర్ ను కేసీఆర్ కు కేటాయించారు.

కేసీఆర్ కు ఇచ్చిన ఛాంబర్ ను మార్చేయడం వెనుక కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా, అవమానించేలా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు దిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా. తమ పార్టీకి 39మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంత చిన్న చాంబర్ సరిపోదని, ప్రధాన ప్రతిపక్ష నేతకు ఆనవాయితీగా కేటాయిస్తూ వచ్చిన చాంబర్ నే కేసీఆర్ కు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రోటోకాల్ అనేది సమస్యగా వస్తోంది, ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు.. ఈ రెండు అంశాలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మొత్తంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కు చాంబర్ మార్పు అంశం అటు అధికార, ఇటు ప్రతిపక్షం మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసిందని చెప్పొచ్చు.

గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇస్తున్న చాంబర్ ను మార్చేసి దాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం వాడుకుని, కేసీఆర్ కు మరో చాంబర్ ఇవ్వడం, అందులో సరైన సౌకర్యాలు(టీవీ లేదు, వాష్ రూమ్ కు కనీసం గొళ్లం లేదు) లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలనే చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..