ఇసుక కృత్రిమ కొరత సృష్టించారు : చంద్రబాబు
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.

ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. నవంబర్ 14, 2019) విజయవాడలో దీక్ష ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని.. వారి ఇసుక దాహానికి పేదలు బలయ్యారని వాపోయారు. కాలం చెల్లి కార్మికులు చనిపోయారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి స్వార్థం కోసమే ఇసుక కొరత సృష్టించారని విమర్శించారు.
రాష్ట్రంలో ఇసుకను కూడా కబ్జా చేసే పరిస్థితి నెలకొందన్నారు. ఇసుక కొరత వల్ల బిల్డింగ్ లు కట్టే పరిస్థితి లేదన్నారు. ఇసుక లేకుండా చేసి 35 లక్షల కుటుంబాలను ఇబ్బంది పెట్టారని తెలిపారు. కుటుంబ సభ్యులను పోషించలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇసుక సమస్య ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఇసుక లేకపోవడంతో అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజలను మోసం చేసేందుకే కేబినెట్ నిర్ణయాలని విమర్శించారు. వైసీపీ నేతలు ఇసుక దోచుకున్నారని ఆరోపించారు. చెన్నై, బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతోందన్నారు.
విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ దగ్గర 12 గంటల నిరసన దీక్షకు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఏపీలో ఇసుక కొరతను తీర్చడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు రూ.25లక్షలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో ఆయన దీక్ష చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీక్షకు జనసేన, బీజేపీ కూడా మద్దతు తెలిపాయి.