ఒంగోలులో టెన్షన్ : టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు

ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. టౌన్ లోని ప్రధాన ఏరియా అయిన కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ.. టీడీపీ కార్యకర్తలు రోడ్లుపైకి వచ్చారు. మెయిన్ రోడ్డులో బైఠాయించారు. బాలినేని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఒంగోలు టౌన్ లోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో రెండు వర్గాలు పోటీపోటీ ఆందోళనలకు దిగటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలినేని రాకను నిరసిస్తూ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రోడ్లపై బైటాయించారు. వైసీపీ నేతలు కూడా టీడిపీకి పోటీగా.. ఆందోళనలు చేపట్టారు.
రెండు వర్గాలు మెరుపు ధర్నాలు, ఆందోళనలతోఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో.. పోలీసులు జోక్యం చేసుకున్నారు. బాలినేనికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.