వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారు : సీఎం చంద్రబాబు

తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : March 16, 2019 / 10:06 AM IST
వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారు : సీఎం చంద్రబాబు

Updated On : March 16, 2019 / 10:06 AM IST

తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.

చిత్తూరు : తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు…విభజన హామీలు నెరవేర్చలేదన్నారు. మోడీ నమ్మక ద్రోహంపై తిరుగుబాటు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు బాంబులు, బుల్లెట్లకే భయపడరు..మోడీ బెదిరింపులకు భయపడుతారా అని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.  

ఏపీ సమస్యలపై 29 సార్లు ఢిల్లీ వెళ్లి..పదేపదే చెప్పామని.. అయినా వినలేదన్నారు. బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని….విభజన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదన్నారు. 18 హామీలు ఇచ్చారు…ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. నమ్మక ద్రోహం చేశారనే బీజేపీపై తిరుగుబాటు చేశామని తెలిపారు. రాష్ట్రం కోసం తిరుగుబాటు చేస్తే మనపైనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ, ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.