సినిమానే చూపిస్తున్నాడు : రోజుకో పార్టీ ఎక్కే గడప దిగే గడప

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 10:27 AM IST
సినిమానే చూపిస్తున్నాడు : రోజుకో పార్టీ ఎక్కే గడప దిగే గడప

ఎప్పుడు.. ఏ రోజు ఏ పార్టీ ఆఫీస్ గడప తొక్కుతాడో.. ఏ పార్టీ లీడర్‌తో భేటీ అవుతాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైఖరి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలీతో సరదాగా అన్న ట్యాగ్ లైన్‌కు భిన్నంగా.. అలీ జంపింగ్ పాలిటిక్స్ ఏంటీ అనే టాక్ మొదలైపోయింది. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వకుండానే.. 70ఎంఎం సినిమా చూపిస్తున్నాడని.. పార్టీలో చేరేందుకే ఇన్ని గేమ్స్ ఆడితే.. ఒక్కసారి పొలిటికల్ పార్టీ జెండా కప్పుకున్న తర్వాత ఇంకెన్ని చిత్రవిచిత్రాలు చూపిస్తాడో అలీ అంటూ పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. అమ్మో అమ్మో.. అలీనా మజాకా అంటున్నారు. తన నోటితో ఏ విషయాన్ని చెప్పకుండానే.. ఇంత రాద్దాంతం చేసేస్తున్నాడు అంటే మాటలా అంటున్నారు.

పాదయాత్రలో ఉన్న జగన్‌తో అలీ భేటీ అయ్యారు. వ్యాన్‌లో ఉన్న జగన్‌తో నవ్వుతూ కనిపించారు. జస్ట్ చిన్న ఫొటో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే వైరల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలీ జాయిన్ అంటూ కోడై కూసింది. ఆ వార్త ఇంకా వైరల్ నుంచి మాయం కాలేదు.. వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యాడు. జగన్‌కు హ్యాండ్ ఇచ్చిన అలీ అంటూ పిచ్చపిచ్చగా స్టోరీలు వచ్చేశాయి. ఈ స్టోరీ లింక్స్ ఇంకా డిలీట్ కూడా కాలేదు.. అప్పుడే టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యాడు అలీ. ఇంకేముందీ టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు లీకులు. ఇంతకీ అలీ జాయిన్ అయ్యే పార్టీ ఏది.. ఎప్పుడు చేరతాడు.. ఎందుకు ఇలా అన్ని పార్టీల ఎక్కే గడప దిగే గడప అన్నట్లు తిరుగుతున్నాడనే ప్రచారం మొదలైపోయింది. అలీగారు.. సరదాగా సాగే మీ షో కాదండీ ఇది.. సీరియస్ పాలిటిక్స్. చిన్న మిస్టేక్ అయినా ఐదేళ్ల జీవితమే కాదు.. 30 ఏళ్ల సినీ కెరీర్ కూడా డైలమాలో పడుతుంది.. బీ కేర్ ఫుల్ బ్రదర్…