Sachin And Sara Divorced: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. భార్యకు విడాకులు ఇచ్చిన సచిన్
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు

Sachin And Sara Divorced: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తన భార్య సారా అబ్దుల్లాకు విడాకులు ఇచ్చారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. సారా అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. సచిన్ పైలట్, సారా అబ్దుల్లా 2004లో వివాహం చేసుకున్నారు.
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతోనే ఆయన విడాకులు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామితో విడాకులు తీసుకున్నట్లు రాసి ఉంది.
సచిన్ పైలట్, సారా అబ్దుల్లాలకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అరన్ పైలట్, విహాన్ పైలట్. ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారులను డిపెండెంట్లుగా సచిన్ పైలట్ అభివర్ణించారు.