Delhi Liquor Scam: సిసోడియా, జైన్‭లపై వివాదాస్పదంగా పోస్టర్లు అతికించిన కాంగ్రెస్

రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్‭లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. సిసోడియాతో పాటే జైన్ సైతం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Delhi Liquor Scam: సిసోడియా, జైన్‭లపై వివాదాస్పదంగా పోస్టర్లు అతికించిన కాంగ్రెస్

Delhi Congress puts up posters showing AAP's Sisodia, Jain in jail

Updated On : March 6, 2023 / 5:34 PM IST

Delhi Liquor Scam: లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా అవినీతి కేసులో అరెస్టైన మరో మంత్రి సత్యేంద్ర జైన్‭లపై కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద పోస్టర్లు విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు వీధుల్లో వాటిని అతికించింది. ఇద్దరు ఆప్ నేతల్ని జైలులో ఉన్నట్లుగా ముద్రించి, ‘అవినీతిపరులే దేశద్రోహులు’ అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ మాటల్ని దానిపై రాసుకొచ్చింది. సిసోడియాకు మద్దతుగా ఆప్ ఢిల్లీ వీధుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసిన అనంతరమే కాంగ్రెస్ ఈ విధంగా పొలిటికల్ అటాక్ ప్రారంభించింది.

BS Yeddyurappa : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ 2021-22లో ఆరోపించిన అక్రమాలలో సిసోడియా పాత్రను ఎత్తిచూపేందుకు “అవినీతి – కుంభకోణాల హోలికా దహన్” పేరుతో ఢిల్లీలో వరుస పైర్లను దహనం చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. “లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ అనేవి ప్రముఖమైన సామాజిక పరిపాలనా దురాచారాలు. కాబట్టి ఆప్ ప్రభుత్వ హయాంలో ప్రబలంగా ఉన్న అవినీతి, కుంభకోణాలకు ముగింపు పలకాలని మేము హోలీ చిట్టాను తగలబెట్టాలని నిర్ణయించుకున్నాము” అని ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్