మంత్రివర్గ విస్తరణకు ఎన్నికలు అడ్డుకాదు: ఈసీ 

  • Published By: chvmurthy ,Published On : January 4, 2019 / 09:51 AM IST
మంత్రివర్గ విస్తరణకు ఎన్నికలు అడ్డుకాదు: ఈసీ 

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చి 3వారాలు దాటినా ఇంకా రాష్ట మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సీఎంగా కేసీఆర్, హోం మినిష్టర్ గా మహమ్ముద్ ఆలీ  ప్రమాణ స్వీకారం చేశారు. మంచిరోజులు లేవు అని విస్తరణను కేసీఆర్ వాయిదా వేసుకుంటూ వెళుతున్నారు. ఈలోపు పంచాయతీఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి30వరకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంటుంది. దాంతో పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదని వార్తలు వచ్చాయి. కాగా పంచాయతీ ఎన్నికలకు, మంత్రివర్గ విస్తరణకు సంభంధంలేదని,మంత్రి వర్గ విస్తరణ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.