ఏపీకి 3 రాజధానులు తుగ్లక్ చర్య : చంద్రబాబు

ఆంధ్రాకు 3 రాజధానులు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో టీడీపీకి చెందిన 9 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం చర్చలో.. ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పారు సీఎం జగన్. ఏపీలో మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లు కష్టపడి రాజధానిని అభివృధ్ది చేసామని అన్నారు. ఏపీకీ 3 రాజధానులు ఉండాలని సీఎం జగన్ సూచించిన అంశాన్ని ఆయన తప్పు పట్టారు. ఏపీకి 3 రాజధానులు అనేది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు చంద్రబాబు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటున్న సీఎం జగన్.. ఇంతకీ మీరు ఏ రాజధానిలో ఉంటారో చెప్పాలని సీఎంని ప్రశ్నించారు. జగన్ అమరావతిలో ఉంటారా, విశాఖలో ఉంటారా అని చంద్రబాబు అడిగారు.
మంత్రులు అమరావతిలో ఉంటారా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్(విశాఖ) లో ఉంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలో స్వాత్రంత్యం వచ్చిన తర్వాత ఇంతమంది రాజకీయ నాయకుల కంటే జగన్ తెలివైన వాడా…ఏంటీ తిక్క పనులు…కాలమే నిర్ణయిస్తుంది అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బినామీల పేరుతో రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేశారని సీఎం జగన్.. టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. జగన్ కు బినామీలు అలవాటు కానీ మాకు కాదు అన్నారు. బినామీలు ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా అని సవాల్ విసిరారు.
టీడీపీలో ఎవరికీ బినామీలను పెట్టుకునే ఖర్మలేదని…నీకా ఖర్మ ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీలు ఉన్నారని రాజధానిని చంపేస్తారా అన్నారు. భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి తుగ్లక్ పాలనలో ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుందని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు విశాఖ చుట్టుపక్కల భూములు కొన్నట్లు తెలిసిందని చంద్రబాబు ఆరోపించారు.
కమిటీ రిపోర్టు రాకముందే సీఎం జగన్.. 3 రాజధానుల గురించి ప్రకటన చేయటం ఏంటని చంధ్రబాబు ప్రశ్నించారు. రాజధానిపై అడిగితే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తారా అని సీరియస్ అయ్యారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని వాపోయారు. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తే పరిస్ధితి వస్తుందని హెచ్చరించారు. అన్నిరంగాల్లో ఏపీ వెనుకబడిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 10 శాతం నిధులు రాజధాని కోసం ఖర్చు చేసినట్లు చూపించారని అన్నారు.
ఆదాయం 50 శాతం రావాల్సింది 33 శాతమే వచ్చిందని తెలిపారు. ఆర్అండ్ రోడ్లు పై ఏమీ ఖర్చు చేయలేదని అన్నారు. మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. అనని మాట అన్నట్లు క్రియేట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల మీద సమాధానం చెప్పరు. నరేగా మీద సమాధానం చెప్పరు. పోలవరం విషయంలో సమాధానం చెప్పరు, అమరావతి మీద సమాధానం చెప్పకుండా అన్యాయం జరిగిందని. పిచ్చి వాడి చేతిలో రాయి మాదిరిగా ఉందని. అన్నీ ఒకే చోట ఉంటేనే పరిపాలన కంట్రోల్ లేని రోజుల్లో పరిపాలనను సందిగ్ధంలో పెట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
Also Read : బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు..!?