టీడీపీకి ఎదురుదెబ్బ..! వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి..!

టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

టీడీపీకి ఎదురుదెబ్బ..! వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి..!

Gollapalli Surya Rao

Gollapalli Surya Rao : అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రాజోలు టికెట్ ను జనసేనకు కేటాయించడంతో ఆయన కినుకు వహించారు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారు సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. రాజోలు వైసీపీ టికెట్ తనకు ఇవ్వాలని సూర్యారావు అడిగే అవకాశం ఉంది.

గొల్లపల్లి సూర్యారావు రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన తాడేపల్లి చేరుకున్నారు. రాజోలు నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోందని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గొల్లపల్లి సూర్యారావు, ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్.. వైసీపీలో చేరారు. ఈ క్రమంలో రాజోలు వైసీపీ అభ్యర్థిగా జగన్ ఎవరి పేరుని ఖరారు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..