వీరాభిమాని : చంద్రబాబు కోసం మోకాళ్ల యాత్ర 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 01:09 PM IST
వీరాభిమాని : చంద్రబాబు కోసం మోకాళ్ల యాత్ర 

అనంతపురం : కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు… మోకాళ్లపై నడుస్తుంటారు. అన్నదానాలు చేస్తుంటారు. అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారు. కానీ టీడీపీనే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఓ అభిమాని మోకాళ్ల యాత్ర చేపట్టారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వీరాభిమాని బాలాజీ నాయక్ 9 కి.మీ మోకాళ్ల యాత్రను చేస్తున్నారు.

రెక్కమాను ఆంజనేయస్వామి దేవాలయం నుంచి తిమ్మమానూరు వరకు మోకాళ్లపై నడవనున్నారు. టీడీపీ మండల కన్వీనర్ వెంకట రమణారెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. 2019లో చంద్రబాబు మళ్లీ సీఎంగా, స్థానిక టీడీపీ ఇన్ చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలవాలని తాను యాత్ర చేస్తున్నట్లు బాలాజీ తెలిపారు.