వైసీపీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరారు.

టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరారు.
తూర్పు గోదావరి : లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాయకుల వలసలు అధికమయ్యాయి. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీల కండువాలు మార్చుతున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రానికి మరో పార్టీలోకి మారిపోతున్నారు. టికెట్ వస్తుందని భావించిన ఆశావహులు రాకపోవడంతో పార్టీ మారుతున్నారు. జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మరో నేత ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరారు.
జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుబ్బారాయుడుకి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్బారాయుడు గత ఏడాది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేశారు. ఈ ఎన్నికల్లో నరసాపురం టికెట్ ఆశించారు. పార్టీ నాయకత్వం సుబ్బారాయుడుకి సీటు ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేశారు.