రూ.40 లక్షలు తీసుకున్నారు..! మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు

చైర్మన్ పదవి కోసం 70 లక్షలు ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారని, చివరికి 40లక్షలు ఇస్తే పదవి ఇస్తామని చెప్పారని భువనేశ్వరి తెలిపారు.

రూ.40 లక్షలు తీసుకున్నారు..! మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు

Sensational Allegations On Minister Roja

Minister Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని మంత్రి రోజా కుటుంబం అమ్ముకుందని, అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తనకు పదవి ఇవ్వలేదని ఆరోపించారు. పూత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని మంత్రి రోజా నాకు హామీ ఇచ్చారని భువనేశ్వరి తెలిపారు. పదవి కోసం ఇతర విషయాలు తన అన్న కుమార స్వామితో మాట్లాడాలని మంత్రి రోజా చెప్పారని వెల్లడించారు.

చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి 70 లక్షలు డిమాండ్ చేశారని, 40లక్షలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదన్నారు. రెండవ దఫా చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి నేటివరకు నాకు అవకాశం కల్పించలేదని భువనేశ్వరి వాపోయారు. ఇప్పుడు పదవి గురించి అడిగితే.. ఎన్నికల అనంతరం చైర్మన్ పదవి కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

ఎన్నికల తర్వాత మాకు పదవి అవసరం లేదన్నారు భువనేశ్వరి. మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వాలని అడిగినా రోజా, ఆమె అన్న కుమార స్వామి స్పందించడం లేదని వాపోయారు. మంత్రిపై పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారా? అని అడిగారు. డబ్బు విషయమై.. మంత్రి రోజాకు మెసేజ్ చేసినా, స్వయంగా వెళ్లి కలిసినా ఎటువంటి స్పందన లేదని భువనేశ్వరి వాపోయారు. ఈ విషయంలో దళిత మహిళ అయిన తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని కౌన్సిలర్ భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడారు పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశ చూపించి 70లక్షలు అడిగారని, చివరికి 40లక్షలకు ఒప్పందం చేసుకుని, ఆ మేరకు మంత్రి రోజా సోదరుడికి డబ్బులు ఇచ్చామన్నారు. అయితే, అటు పదవి ఇవ్వకుండా ఇటు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా తనను మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు భువనేశ్వరి.

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

” మంత్రి రోజా సోదరుడు కుమార స్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. మాకు రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పాను. లేదని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. సరే అని మూడు విడతల్లో 40లక్షలు ఇచ్చాను. ఎన్నికల తర్వాత ఛైర్మన్ పదవి వేరే వారికి ఇచ్చారు. మాకు ఇస్తామని చెప్పి వేరే వాళ్లకు ఇచ్చారేంటి అని అడిగాను. రెండేళ్ల తర్వాత పదవి ఇస్తామని చెప్పారు. రెండేళ్ల తర్వాత తిరిగితే.. రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తామని చెప్పారు. మళ్లీ తిరిగాను. ఇక లేదు, ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పారు. మేడంకు మేసేజ్ పెట్టాను. నాకు చైర్మన్ పదవి ఇవ్వకపోయినా పర్లేదు. నా డబ్బులు నాకు వెనక్కి ఇప్పించండి అని మేసేజ్ పెట్టాను. మేసేజ్ చూశారు కానీ మేడమ్ రిప్లయ్ ఇవ్వలేదు. నాకు జగనన్నే న్యాయం చేయాలి” అని పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి కోరారు.