ఆర్టీసీ జీతభత్యాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికులకు ఇచ్చే జీతభత్యాలపై పిటిషన్ దాఖలైంది. దీనిపై 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం విచారించింది కోర్టు. అయితే..ఏజీ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ సమయం కోరింది. దీంతో తెలంగాణ హైకోర్టు విచారణనను నవంబర్ 27కు వాయిదా వేసింది.
మరోవైపు..అనుభవం లేని డ్రైవర్లు, కండక్టర్లను నియమించడం వల్ల రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని లాయర్ గోపాలకృష్ణ కళానిధి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్, ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రోడ్డు రవాణా ప్రిన్స్‌పల్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణనను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
> ప్రాధాన్యత సంతరించుకున్న గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ.
> 52వ రోజు కొనసాగుతున్న తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.
> విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
> ఆర్టీసీ జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది,
> ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం.
> ప్రభుత్వానికి అందనున్న 5వేల 100 రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు కాపీ.
> ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న టీజేఏసీ.
> 2019, నవంబర్ 25 సోమవారం అన్ని డిపోల దగ్గర సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు.
Read More : బ్రేకింగ్ : గవర్నర్‌ను కలవనున్న సీఎం కేసీఆర్