ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు మోసం : జగన్

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 02:19 PM IST
ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు మోసం : జగన్

Updated On : March 19, 2019 / 2:19 PM IST

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదాను అమలు చేయమని ఒక్కరోజు కూడా ప్రణాళికా సంఘాన్ని అడగలేదన్నారు. పైగా ప్రత్యేకోహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అడిగారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వేమూరులో వైసీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. హోదా 15 ఏళ్లు తీసుకొస్తానని ఐదేళ్లు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో హోదా గురించి మోడీ, అమిత్ షాను అడగలేదన్నారు. బీజేపీతో విడిపోయినట్లు నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ-బీజేపీ నాలుగేళ్లు కలిసి పనిచేసి రాష్ట్రానికి ఏం చేశాయని ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్ష చేస్తున్నట్లుగా నల్లచొక్కా వేసుకుని మరో డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖాజానాతో ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, హోదా అంశంలోనూ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా పని చేసినా ఏమీ చేయలేదని విమర్శించారు. హోదా కోసం ప్రణాళికా సంఘాన్ని చంద్రబాబు ఒక్కసారైనా కలిశారా.. ప్రణాళికా సంఘానికి ఒక్కసారైనా లేఖ రాశారా అని నిలదీశారు. ఆనాడు అర్ధరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టారని.. అర్ధరాత్రి అరుణ్ జైట్లీతో అబద్ధపు ప్యాకేజీ ప్రకటన చేయించారని విమర్శించారు. అబద్ధపు ప్యాకేజీ అయితే మోడీని చంద్రబాబు ఎందుకు పొగిడారన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తే దగ్గరుండి చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. హోదా కోసం పోరాటం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని చెప్పలేదా అని గుర్తు చేశారు. వైసీపీ అవిశ్వాసం పెట్టకపోయుంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టేవాడా అని అన్నారు. ఎన్నికలకు 14 నెలల ముందుగానే హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని తెలిపారు. చంద్రబాబు తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే హోదా వచ్చేదన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు, లోకేష్ కొల్లగొట్టారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై చీకటి సమావేశాలు నిర్వహించి డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు అన్యాయం చేశారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. రూ.1138 కోట్లు ఇస్తే 14 లక్షల బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో లేని అభివృద్ధిని చూపించారని తెలిపారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఈ 20 రోజుల్లో చెప్పని అబద్ధాలు, చూపని సినిమా ఉండదన్నారు. ఆయన మోసాలు, కుట్రలు ఇంతటితో ఆగిపోవన్నారు జగన్. చంద్రబాబు ప్రతీ గ్రామానికి మూటల కొద్ది డబ్బు తీసుకొస్తారని ఆరోపించారు.