కరెన్సీ నోట్లపై అంబేద్కర్, సావర్కర్, పీవీ నరసింహారావు చిత్రాలు చూడాలని ఉంది…..నాగబాబు

  • Published By: murthy ,Published On : May 23, 2020 / 07:00 AM IST
కరెన్సీ నోట్లపై అంబేద్కర్, సావర్కర్, పీవీ నరసింహారావు చిత్రాలు చూడాలని ఉంది…..నాగబాబు

Updated On : May 23, 2020 / 7:00 AM IST

మహాత్మాగాంధీ హంతకుడు నాధూరాం గాడ్సేపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ నాయకుడు, సినీనటుడు నాగబాబు తాజాగా మరోసారి కరెన్సీ నోట్ల గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 

“ఇండియన్  కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. “

గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.”

 

Read:  గాడ్సే బతికి ఉంటే ఇలాగే ప్రార్థించేవాడు.. నాగబాబు గాడ్సే ట్వీట్ పై విజయశాంతి