కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్మహత్యాయత్నం

Yediyurappa’s political secretary attempts suicide : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఆత్మాహత్యాయత్నం చేశారు. డాలర్స్ కాలనీలో నివాసం ఉండే సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆయన గదిలో పడిపోయి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి బెంగుళూరులోని ఎం.ఎస్.రామయ్య మెమోరియల్ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం తెలుసుకున్న సీఎం యెడ్యూరప్ప వెంటనే ఆస్పత్రికి వెళ్లి సంతోష్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎందుకు అలా చేసుకున్నాడనే విషయం తనకూ తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదన్నారు. ఎందుకు ఇలా చేసాడో తర్వాత తెలుస్తుందని ఆయన అన్నారు.
https://10tv.in/tmc-heavyweight-suvendu-adhikari-resigns-as-west-bengal-transport-minister/
సంతోష్ డిప్రెషన్ లో ఉన్నట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. యెడ్యూరప్ప బంధువైన సంతోష్ రాజకీయాల్లోకి తుపానులా దూసుకు వచ్చాడుయ ఈ ఏడాది మే నెల లోనే, సంతోష్ యెడ్డీకి రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. మరియు ఆపరేషన్ కమలంలో కీలక పాత్ర పోషించాడు. సీఎం కుటుంబ సభ్యులతో అతనికున్న సంబంధంబాంధవ్యాలపై ఇప్పడు అందరూ చర్చించుకుంటున్నారు. గతేడాది జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవటంలో సంతోష్ కీలక పాత్ర పోషించాడు.