కాంగ్రెస్‌లోనే చనిపోతానన్న కేకే..! కేసీఆర్ సీరియస్

నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లోనే చనిపోతానన్న కేకే..! కేసీఆర్ సీరియస్

Kk On Party Change

K Keshava Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావుపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీ మారతానని స్పష్టం చేసిన కేకేకు ఆయన క్లాస్ తీసుకున్నారు. ఇటీవల కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేసీఆర్ తో భేటీలో.. తాను పార్టీ మారతానని స్పష్టం చేశారట కేకే. కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని కేకే తేల్చి చెప్పారట. పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారు అని కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. మీ ఆలోచన మార్చుకోండి అని కేకే కు సూచించారట కేసీఆర్.

ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో కేకే భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై చర్చించారు. అనంతరం కేకే హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు. అటు కేకే నివాసానికి గడ్డం అరవింద్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. కొంత కాలంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి, ఆస్తుల వివరాలు బయటపెట్టండి- డీజీపీకి ఫిర్యాదు