కేసీఆర్ సమీక్ష: 15వ ఆర్ధిక సంఘం

KCR Review for Fifteenth Finance Commission visit in telangana

  • Published By: chvmurthy ,Published On : January 12, 2019 / 04:18 PM IST
కేసీఆర్ సమీక్ష: 15వ ఆర్ధిక సంఘం

Updated On : January 12, 2019 / 4:18 PM IST

KCR Review for Fifteenth Finance Commission visit in telangana

హైదరాబాద్: సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 15 వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. ప్రజల బాగోగులు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి సంబంధించిన విస్తృతమైన విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉందని, జాతీయ స్ధాయిలో పనిచేస్తున్న రెండు రాజకీయ వ్యవస్ధలు విఫలం అయ్యాయని  కేసీఆర్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన కనీస సమన్వయం ఉండటం లేదని, కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందాల్సిన వాటాల్లో వివక్ష ఉంటోందని, కక్ష  సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వాలు రాష్ర్టాలను అగౌరవపరుస్తున్నాయని  ఆయన అన్నారు. రాష్ర్టాలకు అప్పగించాల్సిన అధికారాలను కూడా  కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని, రాష్ర్టాల అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర విధానాలు ఉంటున్నాయని కేసీఆర్ తెలిపారు.