అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ

ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జిల్లా కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మార్చి 5వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఆయనతో భేటీ అయ్యి.. చర్చలు జరిపారు. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట పవన్ తో భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Also Read : ఆప్ తో పొత్తు లేదు: ప్రకటించిన కాంగ్రెస్
మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత వెనక్కి తగ్గారు. టీడీపీలోనే కొనసాగుతారని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ తో భేటీ కావటం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం టీడీపీలో ఉండలేని పరిస్థితులు ఉన్నట్లు అతని అనుచరులు చెప్పుకుంటున్నారు. అలా అని జగన్ పార్టీలోకి కూడా వెళ్లటం లేదని.. ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీలో మాగుంట చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సమావేశంపై జనసేన పార్టీ, మాగుంట ఎలాంటి ప్రకటన చేయలేదు. మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు చెబుతున్నారు. ఇవన్నీ బయటకు చెప్పే మాటలే అని.. జనసేన పార్టీలో మాగుంట జాయిన్ అవుతున్నారని మరికొందరు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయం నేదురుమల్లి, ఆనం, మాగుంట కుటుంబాల మధ్యనే సాగుతోందని , వీరి వల్ల యువత బాగు పడలేదని, వీరు ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ మాగుంటపై విమర్శలు చేసిన ఒక్కరోజు తర్వాతే పవన్ కళ్యాణ్ తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటి అవడం విశేషం.
Also Read : అర్హులకు మాత్రమే :రేషన్ కార్డుల జారీలో కీలక నిర్ణయం