Ambati Rambabu : రాజకీయాలకు పనికిరావు, జగన్‌ని తొక్కే వారు భూమి మీద లేరు- పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్

చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కలిగిన బాధ వంగవీటి రంగను చంపినప్పుడు లేదా..? ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు రాలేదా?

Ambati Rambabu : రాజకీయాలకు పనికిరావు, జగన్‌ని తొక్కే వారు భూమి మీద లేరు- పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu Slams Pawan Kalyan

Updated On : February 29, 2024 / 6:15 PM IST

Ambati Rambabu : టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తీవ్ర విమర్శలతో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపడే వ్యక్తి కాదన్నారు మంత్రి అంబటి. పవన్ మాట్లాడిన మాటలు ఆయనకే అర్థం కావని విమర్శించారు. ప్రశ్నించమని చెప్పి ఇప్పుడు ప్రశ్నించొద్దంటున్నావ్ అని పవన్ పై మండిపడ్డారు. పవన్.. నీకు దమ్ముంటే చంద్రబాబును బెదిరించి మరో నాలుగు సీట్లు ఎక్కువ తెచ్చుకో.. అని సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.

”చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కలిగిన బాధ వంగవీటి రంగను చంపినప్పుడు లేదా..? ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు రాలేదా? జగన్ మోహన్ రెడ్డిని తొక్కే వారు భూమి మీద లేరు.‌ జగన్ ధీరుడు. పవన్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. పవన్.. నీకు 4వ పెళ్ళాం నాదెండ్ల మనోహర్ గుర్తుపెట్టుకో. నీకు, చంద్రబాబుకి మొగుడు జగన్. రాజకీయ పార్టీని నడపడం పవన్ వల్ల కాదు” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Also Read : రాజానగరంలో టైట్ ఫైట్.. ఒకప్పటి సహచరుల మధ్య ఆసక్తికర పోరు