Karumuri Venkata Nageswara Rao : పట్టుమని 10వేల మంది కూడా రాలేదు, ఏపీలో టీడీపీ క్లోజ్- మంత్రి కారుమూరి

Karumuri Venkata Nageswara Rao : చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు.

Karumuri Venkata Nageswara Rao : పట్టుమని 10వేల మంది కూడా రాలేదు, ఏపీలో టీడీపీ క్లోజ్- మంత్రి కారుమూరి

Karumuri Venkata Nageswara Rao (Photo : Twitter )

Updated On : May 28, 2023 / 6:20 PM IST

Karumuri Nageswara Rao – TDP Mahanadu : టీడీపీ మహానాడుపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు వెలవెలబోయిందన్నారు. పట్టుమని 10వేల మంది కూడా మహానాడుకు హాజరకాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంత్రి కారుమూరి మాట్లాడారు. టీడీపీ మహానాడుపై హాట్ కామెంట్స్ చేశారు.

Also Read..Kodali Nani : దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి.. చంద్రబాబు, లోకేష్ కు కొడాలి నాని సవాల్

”చంద్రబాబు మహానాడు వెలవెలబోయింది. పట్టుమని పది వేల మంది కూడా హాజరు కాలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయింది. చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు. గతంలో 600 హామీలను ఇచ్చి ప్రజలను మాయ చేసి నెత్తి మీద గుడ్డ పెట్టారు.

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించి డబ్బాలో వేస్తారు. జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98శాతానికి పైగా అమలు చేశారు. సెంటు భూమి ఇస్తే సమాధికి పనికొస్తుందా? అని అచ్చెం నాయుడు అనడం దారుణం” అని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు.

Also Read..NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..

మాజీమంత్రి కొడాలి నాని సైతం టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని, ఈసారి అవి కూడా రావని జోస్యం చెప్పారు. రాజమండ్రి మహానాడులో ఆకర్షణీయమైన అబద్ధాలు ఆడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీని ఎన్టీఆర్ కుటుంబం స్వాధీనం చేసుకుంటుందని కొడాలి నాని అన్నారు.

గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. టీడీపీ మహానాడు, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని ప్రజలకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఇస్తామని చెప్పడానికి ఇదేమైనా బట్టల కొట్టా? బంగారం దుకాణమా? సిగ్గు, శరం లేదు. ఈ 14ఏళ్లలో చంద్రబాబు ఏమిచ్చారు ఆకర్షణీయమైనవి? రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు అని విరుచుకుపడ్డారు కొడాలి నాని.