Bandi Sanjay : భారత మాత వైపు చూస్తే కళ్ళు పీకి బొందపెట్టే హీరో మోదీ, తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్- పార్లమెంటులో బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్

శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. Bandi Sanjay - Parliament

Bandi Sanjay : భారత మాత వైపు చూస్తే కళ్ళు పీకి బొందపెట్టే హీరో మోదీ, తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్- పార్లమెంటులో బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్

Bandi Sanjay Speech In Loksabha

Updated On : August 10, 2023 / 7:08 PM IST

Bandi Sanjay – Parliament : పార్లమెంటులో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వీరావేశంతో మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరో అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో వారికే స్పష్టత లేదని విపక్షాలపై ఎదురుదాడికి దిగారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా బండి సంజయ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ గజినీని తలపిస్తున్నారని ఆయన విమర్శించారు. భారత మాత హత్య జరగదన్నారు. భారత మాత వైపు చూస్తే కళ్ళు పీకి బొంద పెట్టే హీరో భారత ప్రధాని మోడీ అని బండి సంజయ్ అన్నారు. భారత మాతను కాపాడటానికి నరేంద్ర మోదీ ఉన్నారని ఆయన చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు.. అవిశ్వాసాన్ని పెడితే ప్రజలు సహించరని హెచ్చరించారు.(Bandi Sanjay)

”కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆప్, బీఆర్ఎస్ వల్ల ఏమీ కాదు. శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. తెలంగాణను ఇచ్చిన దేవాలయం ఈ పార్లమెంట్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1400 మంది బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. బలిదానాలు జరుగుతున్నా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ చొరవ, బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పడింది. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇల్లైనట్లు ఒక కుటుంబం తెలంగాణలో చేరింది.

Also Read..No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ

తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటోంది. అవినీతి యూపీఏ.. ఇండియాగా ఎలా మారిందో.. అవినీతి టీఆర్ఎస్ అలానే బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ నేత పేరు కసిమ్ చంద్రశేఖర్ రజి. తెలంగాణను నాశనం చేశారు. అధికారంలోకి వచ్చాక కొడుకు ఆస్తి 400 శాతం పెరిగింది. భార్య ఆస్తి 1800 శాతం పెరిగింది. ముఖ్యమంత్రి వ్యవసాయ ఆదాయం కోటి రూపాయలు. కోడలి ఆదాయం 2వేల శాతం పెరిగింది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. తెలంగాణలో రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపిస్తే ఇస్తే రాజీనామా చేస్తా. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా. 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమా?

మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేస్తే ఆ డబ్బులు కూడా బీఆర్ఎస్ దోచుకుంది. మిషన్ భగీరధ పేరుతో 40వేల కోట్లు దోచుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో మోసం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు దోచుకుంటున్నారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది బీజేపీ. ఉచిత బియ్యాన్ని కిలో రూపాయికి అమ్ముకున్నారు. మహిళల ఉపాధి హామీ నిధులను దోచుకున్నారు.(Bandi Sanjay)

నేషనల్ హై వేస్ కు భూమి ఇవ్వరు. భూసేకరణ చేయరు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు. ముఖ్యమంత్రి ఎక్కడికీ రారు. మోదీ మణిపూర్ వెళ్ళడం లేదు అంటున్నారు. ఇంటర్ విద్యార్థులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, యువత, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ రాలేదు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీల్లో జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు. లిక్కర్ తో సంబంధాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. బీజేపీది ఆర్ఎస్ఎస్.

Also Read..Mancherial Constituency: మంచిర్యాల బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఐదుగురి కన్ను.. దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ

ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కోరుతున్నా. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది” అని పార్లమెంటులో చాలా ఆవేశపూర్తితమైన స్పీచ్ ఇచ్చారు బండి సంజయ్.

కాగా, బండి సంజయ్ ప్రసంగానికి బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుతగిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తున్న సమయంలో లేచి నిలబడి నినాదాలు చేశారు. తన ప్రసంగంలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తెచ్చారు. నమస్తే సదావత్సలే శ్లోకాన్ని చదివారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ బండి సంజయ్ కు మద్దతు పలికారు. బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగానికి సభ్యులు కనెక్ట్ అయ్యారు. ప్రసంగం తర్వాత బండి కూర్చున్న చోటుకు వచ్చి అభినందనలు తెలిపారు. చాలా బాగా మాట్లాడారు అంటూ కితాబిచ్చారు.

Also Read..Renu Desai : ప‌వ‌న్ అరుదైన వ్య‌క్తి.. నా మ‌ద్ద‌తు ఆయ‌నకే.. 11 ఏళ్ల నుంచి దూరంగానే ఉన్నాం.. పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దు