ఏపీ కొత్త సీఎస్ నీలం సహానీ ?

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ సీఎస్ గా ఒక మహిళను నియమిస్తున్నట్లు తెలిసింది. ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహానీ నినియమించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఆమె సీఎం జగన్ తో కలిసి లంచ్ చేశారు. సహానీ 1984 కు క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత చీఫ్ సెక్రటరీగా ఎవరు వస్తారనే దానిపై అటు ఉద్యోగ వర్గాల్లోనూ, ఇటూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఐతే సీఎస్ రేసులో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు నీలం సహానీ కాగా మరోకరు సమీర్ శర్మ.
నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.
నీలం సహానీతో పాటు సీఎస్ రేసులో సమీర్ శర్మ ఉన్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2021 నవంబర్ వరకు సమీర్ శర్మ పదవీకాలం ఉంది.