INDIA Meet: విపక్షాల మూడవ సమావేశానికి ఖరారైన తేదీలు.. ఎప్పుడో తెలుసా?
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు

Opposition Meet: పాట్నా, బెంగళూరు నగరాల్లో విపక్షాలు రెండుసార్లు సమావేశమయ్యాయి. అయితే వచ్చే నెల 24-25 తేదీల్లో దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో విపక్షాల మూడవ సమావేశం జరగనుంది. వాస్తవానికి బెంగళూరు సమావేశం అనంతరమే మూడవ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేలు మూడవ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు. 26 విపక్ష పార్టీలు బెంగళూరు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరుకావడం ఈ సమావేశాల్లో హైలైట్‌గా నిలిచింది.
Vijayawada Highway : విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని మరో 24గంటల వరకు పునరుద్ధరించలేం ..
ఇక, ముంబైలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి కో-ఆర్డినేషన్ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర ప్యానల్స్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
దీనితో పాటు 11 మంది సభ్యులతో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి అధ్యక్షుడు, కన్వీనర్‌ను కూడా ముంబై సమావేశంలో ఎన్నుకుంటారని బెంగళూరు సమావేశంలోనే ఖర్గే ప్రకటించారు.