Asaduddin Owaisi: దమ్ముంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఓవైసీ

ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.

Asaduddin Owaisi: దమ్ముంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఓవైసీ

Asaduddin Owaisi

Updated On : May 31, 2023 / 11:33 AM IST

Surgical Strike: ‘హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌’ నిర్వహిస్తామంటూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు తాజాగా చేసినవి కావు. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంఐఎం పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

Rahul in USA: భారత్ జోడో యాత్రకు వెళ్లొద్దని ప్రజల్ని బెదిరించారట.. అమెరికాలో రాహుల్ గాంధీ

మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఓవైసీ మాట్లాడారు. బండి సంజయ్ తాజా విమర్శలపై పాత విమర్శల్ని జోడిస్తూ ‘‘పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటున్నారు.. దమ్ము ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి’’ అని అన్నారు. ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.

Rajasthan Politics: లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని ప్రారంభించున్న ప్రధాని మోదీ

ఏప్రిల్ 23న చేవెళ్లలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘సంకల్ప్ సభ’లో అమిత్ షా మాట్లాడుతూ ఒవైసీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ మజ్లిస్ (ఒవైసీ) వద్ద ఉందని, ఇలాంటి ప్రభుత్వం తెలంగాణను నడపలేదని విమర్శించారు. తాము మజ్లిస్‌కు భయపడమని అన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలని, ఓవైసీ కోసం కాదని అన్నారు.