Rahul in USA: భారత్ జోడో యాత్రకు వెళ్లొద్దని ప్రజల్ని బెదిరించారట.. అమెరికాలో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర ప్రజల భావనల్ని, మానవత్వాన్ని, గౌరవాన్ని మోసుకెళ్లింది. చరిత్రను అధ్యయనం చేస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ దేశాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తించవచ్చు. మేము అదే చేస్తున్నాం

Rahul in USA: భారత్ జోడో యాత్రకు వెళ్లొద్దని ప్రజల్ని బెదిరించారట.. అమెరికాలో రాహుల్ గాంధీ

Rahul Gandhi

Bharat jodo yatra: భారత్ జోడో యాత్రకు వెళ్లొద్దని ప్రజల్ని భారతీయ జనతా పార్టీ నేతలు బెదిరించారని, ప్రభుత్వం సైతం యాత్రను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించిందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ప్రభుత్వం యాత్రను ఎంత అణచి వేయాలని చూస్తే, యాత్రకు అంత ఎక్కువ మంది ప్రజలు వచ్చారని, ఇది జాయన్ ఇండియా కార్యక్రమమని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. మంగళవారం సాయంత్రం శాన్‭ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

‘‘ప్రభుత్వం తనకు చాతనైన అన్ని ప్రయత్నాలను చేసింది. కానీ భారత్ జోడో యాత్రను ఆపలేకపోయింది. ప్రభుత్వ సంస్థల్ని ఉపయోగించి విఫలమయ్యారు. ప్రజల్ని అధికార పార్టీ నేతలు బెదిరించారు, కానీ ఫలితం దక్కలేదు. యాత్రపై వారి ప్రభావం ఏమాత్రం పని చేయలేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి హృదయాన్ని తడిమే జాయిన్ ఇండియా యాత్ర. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్నందున భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Khalistan References: 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి ఖలిస్తానీ అంశాన్ని తొలగించిన ఎన్‭సీఈఆర్‭టీ

‘‘భారత్ జోడో యాత్ర ప్రజల భావనల్ని, మానవత్వాన్ని, గౌరవాన్ని మోసుకెళ్లింది. చరిత్రను అధ్యయనం చేస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ దేశాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తించవచ్చు. మేము అదే చేస్తున్నాం’’ అని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్రం 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ప్రారంభమై సుమారు 3,000 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం జనవరి 30న జమ్మూ కశ్మీర్‭లో ముగిసింది.

#9YearsOfModi Govt : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు .. మరెన్నో సంచలన నిర్ణయాలు

వారం రోజుల పాటు అమెరికాలోని మూడు నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తొలుత శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం అవుతారు. అలాగే జూన్ 4న నూయర్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం జూన్ 10న రాహుల్ పర్యటన ముగుస్తుంది. ఇక జూన్‭లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 22న మోదీకి అధ్యక్షుడు జోబైడెన్, అమెరికా మొదటి లేడి జిల్ బైడెన్‭లు విందు ఏర్పాటు చేస్తారు.