సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో పోలింగ్‌ వాయిదా

నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్‌ వాయిదా పడింది.

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 05:28 AM IST
సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో పోలింగ్‌ వాయిదా

నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్‌ వాయిదా పడింది.

నిజామాబాద్‌ : తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్‌ వాయిదా పడింది. సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు. 

సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు బ్యాలెట్‌ పేపర్‌పై బ్యాట్‌ గుర్తుకు బదులు కప్పు సాసర్‌ రావడంతో అధికారులు పోలింగ్‌ను రద్దు చేశారు. ఐయితే యధావిధిగా కొనసాగుతున్న వార్డ్‌మెంబర్‌ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. వెంటనే సర్పంచ్‌ ఎన్నికలు జరపాలంటూ పట్టుబట్టారు.