మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను : పవన్ ఆవేదన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 03:03 PM IST
మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను : పవన్ ఆవేదన

Updated On : December 8, 2019 / 3:03 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సులో సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జనసేనాని..కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. జనసైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు క్రమశిక్షణ ఉంటే జనసేన గెలిచి ఉండేదన్నారు.

సీఎం జగన్ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా సరే రైతు కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని హెచ్చరించారు. రైతులకు అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై పవన్ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కుల మతాలకు అతీతంగా రైతులకు ఏదో ఒకటి చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరిలోగా రైతు సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.