Maharashtra Politics: ఔరంగాజేబును పొగిడేవారు దేశంలో ఉండకూడదట.. సంజయ్ రౌత్ ఆగ్రహం

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్‌లో వాట్సాప్ పోస్ట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు.

Maharashtra Politics: ఔరంగాజేబును పొగిడేవారు దేశంలో ఉండకూడదట.. సంజయ్ రౌత్ ఆగ్రహం

Updated On : June 7, 2023 / 9:42 PM IST

Aurangzeb: మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో చెలరేగిన అల్లర్లపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఔరంగాజేబును పొగిడేవారు ఈ దేశంలో ఉండకూడదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ హృదయనేత బాల్ థాకరే, శివసేన పార్టీ సిద్ధాంతమని, దాని మీదే తాము నిలబడతామని అన్నారు.

Odisha: ఒడిశాలోని ఝాజ్ పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. ఆరుగురి మృతి

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి విషయమించడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీచార్జ్ చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Karimnagar Medical College: వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకున్న తెలంగాణ.. కరీంగనర్ మెడికల్ కాలేజీపై మంత్రి హరీష్

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్‌లో వాట్సాప్ పోస్ట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, జూన్ 19 వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల్ని సైతం నిలిపివేశారు.

AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్

ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా పోస్టర్ పెడితే శాంతిభద్రతలపై దాడి చేయాల్సిన అవసరం లేదంటే హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ ఇలాంటి ధోరణులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.