టీడీపీ ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు

అమరావతి సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీకి వెళుతున్న టీడీపీ ఎమెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలపై స్టిక్కర్లు లేవని వారిని ఆపేశారు. దీంతో మండలి సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు వాహనం పై ఎమ్మెల్సీ స్టిక్కరు లేకుండా ఎలా వస్తారని పోలీసులు వారిని ప్రశ్నించారు. ఆ సమయంలో అసెంబ్లీకి వెళుతున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వారితో వాదనకు దిగారు. ఎమ్మెల్సీ వాహనంలో ఉండగా స్టిక్కరు ఎందుకని సభ్యులు పోలీసులతో గొడవకు దిగటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు వారిని అనుమతించారు.