ఆర్టీసీ మహిళా కార్మికురాలిపై సీఐ జులుం

  • Published By: madhu ,Published On : November 3, 2019 / 10:22 AM IST
ఆర్టీసీ మహిళా కార్మికురాలిపై సీఐ జులుం

Updated On : November 3, 2019 / 10:22 AM IST

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్‌ రవీందర్‌ అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈయన గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ నేతలు, ఇతర పార్టీలకు చెందిన లీడర్స్ రవీందర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. నవంబర్ 03వ తేదీ ఆదివారం రవీందర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా తీసుకెళుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతిమయాత్రను త్వరగా ముగించాలని ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులకు..పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో..ఓ మహిళా కార్మికురాలిపై సీఐ మధు చేయి చేసుకోవడంతో వివాదం మరింత పెద్దదైంది. సీఐ క్షమాపణ చెప్పేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వమంటూ..రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. 

ఇదిలా ఉంటే..2019 నవంబర్ 05వ తేదీలోగా విధుల్లో చేరాలని, లేనిపక్షంలో వారు ఉద్యోగాలు కోల్పోతారని..కార్మికుల పొట్టకొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు కార్మికులు డ్యూటీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. డిపోల్లో సమ్మతి పత్రాలను అందిస్తున్నారు.
Read More : ఇది సరికాదు : సీఎం నిర్ణయం మార్చుకోవాలి – ఆర్టీసీ కార్మికులు