జగన్ కోసం ఏపీకి తరలించారు, కేసీఆర్ చాలా అన్యాయం చేశారు- బీర్ల అయిలయ్య

నీళ్ళ విషయంలో తెలంగాణకి ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ.

జగన్ కోసం ఏపీకి తరలించారు, కేసీఆర్ చాలా అన్యాయం చేశారు- బీర్ల అయిలయ్య

Telangana Irrigation Projects

Updated On : February 12, 2024 / 12:48 AM IST

Telangana Irrigation Projects : ప్రజా భవన్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకి ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాత నాగార్జున సాగర్ పైకి పోలీసులు వచ్చారని ఆయన చెప్పారు. జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పనుల వల్ల భవిష్యత్తులో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కృష్ణా జలాలపై పోరాటం అంటూ కేసీఆర్ డ్రామా మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.

మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ..
జగన్ తో కుమ్మకై తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేశారు. నీళ్ళ విషయంలో తెలంగాణకి ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొడతాం. నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అన్నీ అబద్ధాలు చెపుతున్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారు.

Also Read : గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..

బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్
కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తాం. అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తాం. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సాయం చేశారని జగన్ అసెంబ్లీలో చెప్పారు. కేసీఆర్ టీమ్ కి బుద్ది చెపుతా. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్ట. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ ముందు రోజు డ్రామాలు చేశారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకుని ఎన్నికలకు వాడుతున్నారు.

Also Read : నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది వీరిద్దరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి